స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీకి రెబెల్స్ బెడద తీవ్రంగా మారింది. తొలి విడత సర్పంచు, వార్డు స్థానాలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఒక్కో చోట సర్పంచు పదవికి ఐదు నుంచి పది మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీలోనే తీవ్ర పోటీ నెలకొనడంతో, రెబెల్స్‌ను బుజ్జగించి పోటీ నుంచి తప్పించడం నేతలకు పెద్ద సవాలుగా మారింది. డిసెంబరు 3న నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, అప్పటిలోగా రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేందుకు నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.