కొడంగల్: ఆటో లారీ ఢీ.. 8 మంది మహిళలకు గాయాలు

85చూసినవారు
కొడంగల్: ఆటో లారీ ఢీ.. 8 మంది మహిళలకు గాయాలు
ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలకు గాయాలైన సంఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. కొడంగల్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న లారీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి హస్నాబాద్ వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్సులో కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్