
అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ.. జట్టులో ద్రవిడ్ కుమారుడు
క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ స్వ్కాడ్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ టోర్నీ నవంబర్ 5 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. టాప్ ఆర్డర్ బ్యాటరైన అన్వయ్ టీమ్ ‘సీ’లో ఆడనున్నాడు. గత సీజన్లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అన్వయ్ 459 పరుగులు చేశాడు. బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 5 నుంచి 11 వరకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ జరగనుంది.




