
వికారాబాద్: చెట్టుకు ఉరి వేసుకుని మల్లప్ప మృతి
కొడంగల్ పట్టణంలో బుధవారం రెనివట్ల గ్రామానికి చెందిన గొల్ల మల్లప్ప (45) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటున్న మల్లప్ప, బుధవారం ఉదయం కొడంగల్ వచ్చి వర్ష కాలనీలోని చెట్టుకు ఉరి వేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


























