
తాండూరులో వాహన తనిఖీలు
తాండూరు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను ఆపి, యూపీఐ ద్వారా వెంటనే చెల్లించాలని సూచించారు. చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
























