నాగోల్‌లో 760 మంది ఈవ్‌టీజర్లకు కౌన్సిలింగ్

242చూసినవారు
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న పోకిరీలకు నాగోల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీపీ సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ, 2026 జనవరి నుంచి మే వరకు షీ టీమ్స్‌కు 760 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడ్డారని, మహిళలను వేధించిన కేసుల్లో 61 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 231 పెట్టీ కేసులు చేశామని తెలిపారు. మహిళలను వేధిస్తున్న వారిలో 180 మంది మైనర్లు, 24 ఏళ్లలోపు యువకులు, 50 ఏళ్ల వయసున్న వారు కూడా ఉండడం బాధాకరం అని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్