రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడి దొంగలు

157చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడి దొంగలు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అమ్లాపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దొంగలు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. యజమాని శ్రీనివాస్ గోవాకు, ఆయన భార్య పిల్లలతో బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగలు, అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలను తెరిచి సుమారు 14 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, రూ.10 లక్షల నగదును అపహరించుకెళ్లారు.

సంబంధిత పోస్ట్