తుర్కయంజాల్ కమ్మగూడకు చెందిన దివ్యాంగుడు సునీల్, పట్టుదలతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా ఏడాదిగా ట్రై సైకిల్‌పై 10 రకాల కూరగాయలు అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఏ పనికైనా సాకులు వెతికే యువతకు, తన ఆత్మవిశ్వాసంతో కష్టపడి బతకడం గొప్పదని నిరూపిస్తూ, స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు.