
పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం: తహశీల్దార్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తహశీల్దార్ మనోహర్ చక్రవర్తి తెలిపారు. మండలంలోని గ్రామాల్లో నాసిరకం ఫిల్టర్ ఇసుక విక్రయాల వల్ల ఇంటి నిర్మాణాల్లో గోడలకు పగుళ్లు వస్తున్నాయని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిల్టర్ ఇసుక వ్యాపారులపై పోలీసులతో కేసులు నమోదు చేయిస్తామని ఆయన హెచ్చరించారు.
































