ముజహిద్ పూర్ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో గెస్ట్ స్పెషల్ నీడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
స్పెషల్ ఎడ్యుకేషన్లో సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి నవంబర్ నుంచి మార్చి వరకు నెలకు రూ. 16, 500 వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు