కోస్గి: పూలే సేవలు మరువలేనివి

51చూసినవారు
కోస్గి: పూలే సేవలు మరువలేనివి
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల ప్రజాపరిషత్ కార్యాలయావరణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్