పరిగి: 'వేధింపులకు గురైతే భయపడొద్దు'

0చూసినవారు
పరిగి: 'వేధింపులకు గురైతే భయపడొద్దు'
వికారాబాద్ జిల్లా పరిగి షీ టీమ్ ఇన్ఛార్జ్ నర్సింలు బుధవారం పరిగిలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థినులకు లైంగిక వేధింపులపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. లోన్ యాప్స్, ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు కాల్ చేయాలని సూచించారు.