వికారాబాద్‌లోని అనంతగిరి గుట్టలో నలుగురు మద్యం మత్తులో ఉన్న పర్యాటకులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. తాండూర్ నుంచి వికారాబాద్ వస్తున్న బస్సు డ్రైవర్‌పై జరిగిన ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతగిరి గుట్ట ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం పట్ల స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.