వికారాబాద్ జిల్లాలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.75 లక్షల విలువైన 25 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్, బొంరాస్ పేట ఠాణాల్లో నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం, ముఠా సభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకుంది. వీరిలో కర్నూల్ జిల్లాకు చెందిన కె.రవి అలియాస్ గౌరితో పాటు మహబూబ్నగర్, జడ్చర్ల, బాలానగర్, హైదరాబాద్కు చెందిన పలువురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.