వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దారుణంలో భార్య అలివేలు, ఆమె సోదరి హన్మమ్మ, చిన్న కూతురు శ్రావణిని ఏపూరి యాదయ్య (38) కత్తితో నరికి చంపాడు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద కూతురు అపర్ణపై కూడా దాడి చేయగా ఆమె తప్పించుకుంది. అనంతరం యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. DSP శ్రీనివాస్ ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.