నాణ్యమైన, స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ లోని ఆవరణలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ డెయిరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విజయ డెయిరీ కేంద్రంలో నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని యాజమాన్యానికి కలెక్టర్ సూచించారు.