రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

7చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సంక్రాంతి సెలవులకు కళాశాల హాస్టల్ నుంచి సోదరిని ఇంటికి తీసుకురావడానికి బైక్‌పై వెళ్తూ గిరిశెట్టి సాయికుమార్ అనే యువకుడు ప్రమాదంలో మృతి చెందాడు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న సాయికుమార్, తన సోదరి ఐశ్వర్యను తీసుకురావడానికి శుక్రవారం పాల్మాకులకు బయలుదేరాడు. మార్గమధ్యంలో బెంగళూరు జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్