లారీని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

3చూసినవారు
లారీని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో పాత రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో నందిగామ మండలం అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన చిన్నంత్ర గారి కార్తీక్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్