
హిందీ సబ్జెక్టుపై విస్తరణోపన్యాసం
కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం హిందీ సబ్జెక్టుపై విస్తరణోపన్యాసం జరిగింది. జడ్చర్ల ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ కె. నరసింహారావు ముఖ్య వక్తగా హాజరై, విద్యార్థులకు హిందీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తాయని, నిఘంటువుతో సమానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


































