రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన దంపతులు మరణించడంతో వారిద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ హృదయవిదారక ఘటనతో తీవ్రంగా చలించిపోయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్ కుమార్, ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు, విద్య, వివాహ బాధ్యతలను తాను స్వీకరిస్తున్నట్లు హామీ ఇచ్చారు. పిల్లల అభ్యున్నతికి తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు.