వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్ మేళా ప్రారంభమైనట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. ఓ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సుగల పదో తరగతి, ఆపై చదువుకుని అర్హతలు ఉన్న నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు.