వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే, ఆయన చేవెళ్ల ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.