బుడగ జంగాల కుటుంబంపై దాడి: ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్

1589చూసినవారు
బుడగ జంగాల కుటుంబంపై దాడి: ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్
వికారాబాద్ జిల్లా దారురూ మండలంలో బుడగ జంగాల నర్సింలు కుటుంబంపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ 307 కేసులు నమోదు చేయాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న దారురూ ఎస్సైని సస్పెండ్ చేయాలని మండల కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, బుడగ జంగం జిల్లా అధ్యక్షులు అశోక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని మహిపాల్ కోరారు.

సంబంధిత పోస్ట్