ఎల్లూరు పంపు స్టేషన్లో మోటార్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 28, 29 తేదీల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, దుద్యాల, దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ప్రజలు ఈ రెండు రోజుల పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని డీఈఈ శశాంక్ మిశ్రా, ఏఈఈ హర్షిత్ రెడ్డి కోరారు.