పరిగిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆధ్యాత్మికవేత్త భాస్కర్ యోగి, నేషనల్ బుక్ రైటర్ శ్రీ కూర జయదేవ్, తపస్ రాష్ట్ర బాధ్యులు శ్రీ జాకా వెంకటేశం, తపస్ జిల్లా కోశాధికారి జి రమేష్ యాదవ్, జిల్లా బాధ్యులు జి లక్ష్మణ్, చంద్రమౌళి, సాయిబాబా, నవీన్ కుమార్, జంగయ్య, వి గోపాల్, శ్రీనివాసులు, బాలరాజు, వెంకటేష్, సంగమేష్, రవి, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ యోగి సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను, కూర జయదేవ్ భారత జాతీయతను సమైక్యంగా ఉంచడంలో ఉపాధ్యాయుల లక్షణాలను వివరించారు. జాకా వెంకటేశం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు తపస్సు చేపడుతున్న కార్యచరణను, రమేష్ యాదవ్ సంఘ కార్యకర్తలకు ఆర్థిక పరిపుష్టిపై సూచనలు, జి లక్ష్మణ్ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు.