మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలో బీజేపీ నాయకులు గజ్జెల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవ లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా యువకులు రక్తదానం చేయగా, 150 మందికి పైగా ప్రజలకు మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని గజ్జెల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంఆర్ హాస్పిటల్ వైద్య బృందం, అంజని పుత్ర బ్లడ్ బ్యాంకు సహకరించాయి.