బొంరాస్‌పేట: తాళం వేసిన ఇంట్లో దొంగలు

0చూసినవారు
బొంరాస్‌పేట: తాళం వేసిన ఇంట్లో దొంగలు
బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన సంగమేశ్వర్ అనే వ్యక్తి హైదరాబాద్లో నివసిస్తూ, అప్పుడప్పుడు గ్రామానికి వస్తుంటాడు. గత నెల 27న ఇంటికి తాళం వేసి వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు, బీరువా పగులగొట్టి పది తులాల వెండి, రూ.15 వేల నగదు దొంగిలించారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బీవీ రమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్