కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు దాదాపు 50 మందితో ప్రైవేట్ బస్సులో వెళ్తున్న కుటుంబసభ్యులకు అనంతగిరి ఘాట్ వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఈ దుర్ఘటన కేసారం, చింతకుంట గ్రామాల్లో విషాదఛాయలు అలుముకుంది.