బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోడిచెర్ల రమేశ్, శ్వేతా దంపతుల మూడేళ్ల కుమార్తె హర్ష నందిని ఇంట్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లి ఇంటి ఆవరణలో వెతుకుతుండగా, బాత్‌రూమ్ గుంతలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.