ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడితప్పి, విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని BC కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీబీఐ విచారణ ఆదేశాలకు వ్యతిరేకంగా వికారాబాద్ లో జరిగిన ఆందోళన సందర్భంగా తమపై అక్రమ కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన వికారాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. తాము అక్రమాలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.