వికారాబాద్ జిల్లాలో BRS నేత గిరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌ను, ప్రభుత్వాన్ని ఉరితీస్తారని ఆయన అన్నారు. ఇటీవల కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో BRS నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి సోనియాగాంధీని బలిదేవత అన్నారని, దానిపై కాంగ్రెస్ నేతలు స్పందించాలని గిరీశ్ డిమాండ్ చేశారు. దేశం మొత్తం ఎవరిని పప్పు అంటుందో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్, BRS మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.