వికారాబాద్ జిల్లా, కొడంగల్ పరిధిలోని లోతుకుంట తండా గ్రామంలోని 198 పోలింగ్ బూత్ పరిధిలో ఓటరు సవరణ (SIR) ప్రక్రియకు ఓటర్లు సహకరించాలని బిఎల్‌ఓలు బుధవారం విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలను అందజేసి, ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకొని సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు.