ఎంకేపల్లి అంగన్వాడి పిల్లలకు దుస్తుల పంపిణీ

0చూసినవారు
ఎంకేపల్లి అంగన్వాడి పిల్లలకు దుస్తుల పంపిణీ
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం ఎంకెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ తుంపల్లి దయాకర్ తన సొంత నిధులతో అంగన్వాడీ బాలబాలికలకు దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆశ వర్కర్ అరుణ, వార్డు మెంబర్ నర్సిములు, జిల్లా మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మాల శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు. చిన్నారుల పట్ల సర్పంచ్ చూపిన చొరవను గ్రామస్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్