మహిళలకు చీరల పంపిణీ: ఈటెల రాజేందర్, కొల్లి మాధవి హాజరు

107చూసినవారు
మహిళలకు చీరల పంపిణీ: ఈటెల రాజేందర్, కొల్లి మాధవి హాజరు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప ఫేస్ 1, 2, 3 వద్ద మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిల్డర్ సెల్ అధ్యక్షులు శ్రీ పద్మా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు కొల్లి మాధవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, రచ్చ చక్రధర్, రవి యాదవ్, స్థానిక పార్టీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్, నరేంద్ర చౌదరి, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సుమన్ రావు, కట్ట కుమార్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్