హైదరాబాద్‌లోని ఎర్రగుంట తండా, ఇందిరమ్మ కాలనీ, కిస్మత్పూర్‌లో నిర్మాణంలో ఉన్న నూతన సేవాలాల్ మహారాజ్ ఆలయానికి తాండూర్ బాలాజీ నర్సింగ్ హోం అధినేత, బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ డా. సంపత్ కుమార్ రూ. 5 లక్షల విరాళం బుధవారం అందించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో థౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.