జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, జిల్లాలో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అవసరమైన బ్యాలెట్ పత్రాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.