వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అటవీ సంరక్షణ చార్మినార్ జోన్ అధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం ఆమె అనంతగిరి కొండల్లో ఎకో టూరిజం అభివృద్ధి పనులు, అటవీ శాఖ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులు, నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యాటకులకు అనంతగిరి కొండపై సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు.