కులమతాలకు అతీతంగా అన్నదానం: మహమ్మద్ అయూబ్ కు శివ స్వాముల సన్మానం

31చూసినవారు
కులమతాలకు అతీతంగా అన్నదానం: మహమ్మద్ అయూబ్ కు శివ స్వాముల సన్మానం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో శివ మాల ధరించిన శివ స్వాములకు కులమతాలకు అతీతంగా గ్రామంలోని మహమ్మద్ అయూబ్ శనివారం మధ్యాహ్నం భిక్ష అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం తర్వాత మహమ్మద్ అయూబ్ ను శివ స్వాములు చాలువతో సన్మానించారు. గ్రామంలోని పలువురు మహమ్మద్ అయూబ్ లాంటి వ్యక్తులు ముందుకు రావడం చాలా సంతోషకరం అని స్వాములు అన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు లవ కుమార్, కృష్ణ, నరేష్ మరియు గ్రామస్థులు, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్