మర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత యునాని వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. సందీప్‌కుమార్, డా. శంకరయ్య, గ్రామస్థులకు వైద్య
పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై అవసరమైన సూచనలు చేశారు. ఆయుర్వేద, యునాని వైద్య విధానాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఆరోగ్య పరిరక్షణలో సంప్రదాయ వైద్య విధానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి శిబిరాలు దోహదపడతాయని పేర్కొన్నారు.