వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రథమ పౌరురాలు పవిత్ర, ఉప సర్పంచ్ సరిత, యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.