గండీడ్: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

83చూసినవారు
గండీడ్: కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గండీడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు శనివారం డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, నేతలు లక్ష్మీనారాయణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.