గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి న్యూ గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో యువకులు ఉట్ల క్రీడను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు దేవాలయాల వద్ద పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు.