గండీడ్ మండల పరిధిలోని కప్లాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా బోనాలు నిర్వహించారు. మహిళలు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గౌడ సంఘం అధ్యక్షులు మొగుల్లయ్య గౌడ్, చెంద్రాయుడు గౌడ్, భీమయ్య గౌడ్, రాములు గౌడ్, గోపాల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణయ్య గౌడ్, సత్యయ్య గౌడ్, రాజు కుమార్, బాలరాజ్ గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.