నిజాంపేట్ లో చెత్తకుప్పలు: అధికారులు, పాలకులపై ఆగ్రహం

49చూసినవారు
నిజాంపేట్ లో చెత్తకుప్పలు: అధికారులు, పాలకులపై ఆగ్రహం
మేడ్చల్ మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా, బాచుపల్లి మండలం, నిజాంపేట్ లో రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి. స్వచ్ఛ నిజాంపేటను చెత్త నిజాంపేటగా మార్చారని మేడ్చల్ అర్బన్ జిల్లా బిల్డర్ సెల్ కన్వీనర్ జి. పద్మ ప్రసాద్ ఆరోపించారు. డెంగ్యూ, మలేరియా దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, అధికారులు, పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పుకుంటున్న నాయకులు, అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.