కామ్రేడ్ జార్జి రెడ్డి స్ఫూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని శనివారం పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జార్జిరెడ్డి వర్ధంతిని విజయవంతం చేయాలని వాల్ పోస్టరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా సభ్యులు సురేష్, అశోక్ పాల్గొన్నారు.