వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధరతో పాటు, సన్న రకాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ను అందించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.