వికారాబాద్ మున్సిపల్ 5వ వార్డు కొత్రేపల్లి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బక్క అర్చన యాదగిరి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అభివృద్ధికి అవకాశం ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే 5వ వార్డును అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరి తదితరులు పాల్గొన్నారు.