వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ గడువులోగా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత, ఈ నెల 10న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.