వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని కరీంపూర్ పంచాయతీ కార్యదర్శి ఖాజా హామీదుద్దీన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెండ్ చేశారు. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ చర్య తీసుకున్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు తమ విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.