కొడంగల్: కల్లు డిపోలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

52చూసినవారు
కొడంగల్: కల్లు డిపోలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
కృత్రిమ కల్లు తయారు చేస్తున్న డిపోలు, దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు చేశారు. వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాలతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బురాన్పూర్, ముద్దాయిపేట గ్రామాల్లో దాడులు నిర్వహించినట్లు కొడంగల్ ఎక్సైజ్ సీఐ వెంకటేశం తెలిపారు. కల్తీ కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్